ఓకే బంగారం విడుదల కాకముందే, ఈ సినిమాపై ఎవరు పడితే వారు రివ్యూలు రాయద్దంటూ సుహాసిని సీరియస్ అయ్యారు. ఆమె చేసిన కామెంట్లపై రేగిన వివాద తీవ్రతను తగ్గించే పని చేశాడు దర్శకుడు మణిరత్నం. ‘సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుకునే హక్కు ఎవరికైనా ఉంటుందనీ, దాన్ని అడ్డుకోవడం సరికాదని’ సుహాసిని ఒక విధంగా చెప్పాలనుకుని మరొకటి చెప్పారని ఆమె మాటల్ని అంత సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదన్నాడు. మేం తీసిన కంటెంట్ బాగుంటే సినిమా అందరికీ నచ్చుతుందని ఒక్క మాటలో తేల్చేశాడు మణిరత్నం. ఈ వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్ అనేది ఆయన మాటల్లోనే అర్థమైంది. ఆయన డైరెక్షన్ లో తీసిన ఓకే బంగారుం శుక్రవారం విడుదలవుతోంది. నిత్యామీనన్ - సల్మాన్ దుల్కర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా వాళ్ళు సుహాసిని వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.