‘నువ్వేనా అది నీవేనా’ ప్లాటినమ్ డిస్క్ వేడుక

April 16, 2015 | 04:38 PM | 46 Views
ప్రింట్ కామెంట్
nuvvena_adi_neevena_platinum_niharonline

వంశీ కృష్ణ, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా సిలివేరి రమేష్ బాబు సమర్పణలో ఆర్.కె.ఫిల్మ్ ఫ్యాక్టరీస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘నువ్వేనా ఆది నీవేనా’. రాజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీ వెంకట్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంచి సక్సెస్ ను సాధించడంతో చిత్రయూనిట్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిపింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా తెలంగాణా మంత్రివర్యులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు సహా దర్శక నిర్మాత రాజ్ కుమార్, ఎమ్.ఆర్.చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవెంకట్, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్, ఎడిటర్ రమేష్, వరంగల్ శాస్త్రి, సుమన్ శెట్టి, నివాస్ ఆనంతనేని, పూర్ణి, రియా అచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ‘’గోదావరి ఖనిలో పుట్టిన రాజ్ కుమార్ గారు దర్శక నిర్మాతగా మారి ఈ రోజు నువ్వేనా ఆది నీవేనా చిత్రాన్ని రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి కావాలి అందుకు అవసరమైన వనురులను అందించడానికి తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కొత్త దర్శకులకు, నిర్మాతలకు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీని అందించి ఇక్కడ తెలుగు సినిమాని డెవలప్ చేస్తాం. తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ వచ్చే విధంగా కృషి చేస్తాం. మంచి సినిమాలను తీసే దర్శక, నిర్మాతలకు ఇన్ సెన్ టివ్ ఇచ్చే విషయమై కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాజ్ కుమార్ మంచి ఆలోచనతో తీసిన ఈ చిత్రం వందరోజుల పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ‘’రాజ్ కుమార్ గారు దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా చేపట్టి ఈ సినిమాని చేయడం మంచి పరిణామమే. సినిమా పెద్ద హిట్టై రాజ్ కుమార్ కి దర్శకుడిగా పేరు, నిర్మాతగా లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ‘’ఒక మంచి ప్రయత్నం చేసిన రాజ్ కుమార్ గారిని అభినందిస్తున్నాం. అతనికి, టీమ్ కి ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయి పేరు తీసుకురావాలి’’ అన్నారు.

దర్శక, నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘’శ్రీవెంకట్ అందించిన సంగీతం చాలా బావుంది. మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ఈ నెల 23న సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నాం. వంశీ కృష్ణ, అనుశ్రీ సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు. ఎమ్.ఆర్.చౌదరిగారి సహాయ సహకారాలను మరచిపోలేం. అందరికీ ప్రత్యేకమైన థాంక్స్’’ అన్నారు.

ఎమ్.ఆర్.చౌదరి మాట్లాడుతూ ‘’రాజ్ కుమార్ కి సినిమాయే లోకం. అనేక కష్టనష్టాలకు ఓర్చి ఈ సినమాని ఈ స్టేజ్ కి తీసుకువచ్చారు. సినిమా బాగా వచ్చింది. ఆడియో సక్సెస్ అయిన విధంగానే సినిమాని సక్సెస్ చేస్తారని బావిస్తున్నాం’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ ‘‘ఆడియో మంచి సక్సెస్ సాధించింది. అదేవిధంగా సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని కాన్ఫడెంట్ గా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాఘవని, మంత్రి హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్ ను సత్కరించారు. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా చిత్రయూనిట్ కి ప్లాటినమ్ డిస్క్ లను అందజేశారు. వరంగల్ శాస్త్రి, జగన్ నాయక్, సుమన్ శెట్టి, జబర్ దస్త్ ఆనంద్, నివాస్ ఆనంతనేని, రోషన్, విజయ్, స్నేహ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: ధరణి కోట శివరాం ప్రసాద్, పాటలు: సంజయ్ గాంధీ, వెంకట్, సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: ప్రసాద్, ఆర్ట్: డేవిడ్, డ్యాన్స్: పాలిక్-ఆఖిల్, సహనిర్మాత: బొల్లంపల్లి సాయిరమణ, రచన-నిర్మాత-దర్శకత్వం: రాజ్ కుమార్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ