ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మరోసారి తన గొంతును ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ గా ఇవ్వనున్నారు. పి.బి.మంజునాథ్ తొలిసారి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లేడీస్ అండ్ జెంటిల్మెన్. తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. రఘు కుంచే ఈ చిత్రానికి బాణీలు అందించారు. రీసెంట్ గా ఈ ఆడియో వేడుకను మధుర శ్రీధర్ అట్టహాసంగా చేశారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ- టీమ్ అందరం కలిసి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాం. కథను ప్రధానం చేసి రూపొందించిన చిత్రానికి ఉదాహరణగా ఈ చిత్రం నిలుస్తుంది. అన్నారు. మొత్తం ఆరు పాటలతో రూపొందించిన సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర దర్శకుడు పిబి మంజునాథ్ తెలిపారు. సోషల్ నెట్వర్క్ కు సంబంధించిన కథ, కథనాలతో చిత్రం రెండు గంటలు ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా సోషల్ నెట్వర్క్ ఉపయోగించేవారు సినిమాకు అభిమాని అవుతారని సహ నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. రాజ్ కందుకూరి సమర్పణలో షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.