మహేష్ మిస్సయిన పెద్ద సమస్యేం లేదు

March 05, 2016 | 05:47 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Suriya-24-Movie-Teaser-niharonline

సూర్య కథానాయకుడిగా నటిస్తోన్న '24' చిత్ర టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం. ఎక్కడ చూసినా ఆ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. టీజర్ పెట్టిన 24 గంటల్లోనే యూట్యూబ్ లో హిట్ల మీద హిట్లతో దూసుకుపోతుంది. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ తో తెరకెక్కించినట్లు అర్థమౌతోంది ఈ టీజర్ ను చూస్తే. ఇక వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్య మరోసారి ప్రయోగాత్మక చిత్రంతోనే రాబోతున్నాడని అర్థమౌతోంది. మూడు గెటప్ లలో సూర్య ఇందులో కనిపిస్తున్నాడు.

                   ఓ వాచ్ నేపథ్యంలో కాలమానంలో ప్రయాణించటమే నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆత్రేయ గా విలన్ పాత్రలో సూర్య హైలెట్ అవుతాడని అనిపిస్తోంది. ఇక ఈ టీజర్ ను చూసిన మహేష్ అభిమానులు సూపర్ స్టార్ అనవసరంగా మిస్సయ్యాడేమో అని తెగ ఫీలయిపోతున్నారు. కేవలం వృద్ధ పాత్రలో తనకు నప్పదనే మహేష్ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రయోగాలకు సూర్య ఎఫ్పుడూ ముందుండటంతో విక్రమ్ కుమార్ నేరుగా సూర్యను అప్రోచ్ కావటం, ఆయన వెంటనే ఒప్పుకోవటం చకచకా జరిగిపోయాయి. ఏ మాటకామాట చెప్పుకొవాలి గానీ టీజర్ లో కనపడ్డ పాత్రలో సూర్య ను అయితే చూడగలుగుతున్నాం గానీ, మహేష్ కి అస్సలు సూటయ్యేవి కాదనిపిస్తోంది. సమ్మర్ లోనే రానున్న ఈ చిత్రంలో సమంత, నిత్యమీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ