బహుశా ఇండియన్ సినిమాల దుస్థితి బహుశా ఇలా తయరు అవుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. పోర్న్ సినిమాలు చేసుకునే సన్నీలియోన్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ ను చేసి పడేశారు మన దర్శకులు. పోనీ నటనలో ఏమైనా ఉందా అంటే నిల్. ఎంత సేపు ఎక్స్ పోజింగ్ తోనే నడిపించేద్దామని, వీలైతే నాలుగు ముద్దు సీన్లు, ఓ బెడ్ సీన్ కానిచ్చి సినిమాని లాగిచ్చేద్దామనకుంటున్నారు. అంత దౌర్భాగ్యానికి దిగజారారు మన డైరక్టర్లు. అడల్ట్ కంటెంట్ తో వచ్చే సినిమాలకు యూత్ లో క్రేజ్ పెరిగిపోవటంతో ఇలా ప్రవర్తిస్తున్నారు. మస్తీ జాదే అనే చిత్ర పోస్టర్లు ఆ మధ్య ఎంత సంచలనం అయ్యాయో మనకు తెలుసు. సినిమాలు మరీ ఇంత మించి బూతును చూపిస్తారా కూడా సగటు ప్రేక్షకుడు కలలోనైనా అనుకుని ఉండడు. ఇక టీజర్ ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన చిత్రాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇది ఒక ఎత్తు ఉండబోతుందని క్లియర్ గా అర్థమౌతుంది.
బెడ్ రూంలోకి వచ్చి నిల్చున్న తుషార్ కపూర్ నడుం కింది భాగం మీదికి ఓ కాయిన్ విసురుతుంది సన్నీలియోన్. కాయిన్ కదిలితే నువ్వు టెస్ట్ పాసైనట్లు మత్తెక్కించే కళ్లతో అంటుంది. ఆ తర్వాత కాయిన్ పైకి విసురుతుంది... జాకెట్ విప్పుతుంది. ఆపై కాయిన్ ఎక్కడో పడుతుంది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది. అది ఇంకెంత దారుణంగా ఉండబోతుందో.