మతిలేని పనులకు మతాన్ని ముడిపెడతారా?

December 22, 2014 | 04:11 PM | 26 Views
ప్రింట్ కామెంట్

పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన దాడి గురించి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ లో ఈ విషయమై సల్మాన్ కూడా తన భావాల్ని బయట పెట్టాడు. ఉగ్రవాదులు చేసే మతిలేని పనికీ పవిత్రమైన మతాన్ని ముడిపెట్టడం సరికాదనీ, ఇది చాలా దుర్మార్గమైన చర్య అనీ ట్వీట్ చేశాడు. ‘‘జిహాద్ అంటే కష్టపడటం... పవిత్ర యుద్ధం. ఇది చాలా మంచిది. కానీ ఇప్పుడు ‘జిహాద్’ అంటే అత్యంత దుర్వినియోగమవుతోన్న పదం. మతం పేరుతో పిల్లలు మహిళలు, పలువురిని ఎవరైతే చంపుతున్నారో వారు ఆ పవిత్ర గ్రంథాన్ని(ఖురాన్) చదవడం లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు. అదే సమయంలో మరొకరి ట్వీట్ కు సల్లూ స్పందిస్తూ, ‘‘భయంకర తీవ్రవాదానికి అమాయక పిల్లల ప్రాణాలను బలి చేస్తూ పెషావర్ దాడి చేయడం ఇస్లాం కాదని’’ రీ ట్వీట్ చేశాడు. సల్మాన్ ఇలా స్పందించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ మతంలోనూ ప్రజలను చంపమని ఉండదు. వీరు చేసే దుష్ట చర్యలకు మద్దతు కోసం మాత్రమే మతాన్ని వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ