సీనియర్ నటి గురించి ఫేక్ న్యూస్

March 19, 2016 | 05:27 PM | 5 Views
ప్రింట్ కామెంట్
fake-news-sukanya-arrested-in-prostitution-niharonline

ఒక చిన్న దారం దొరికితే చాలు డొంక అంతా లాగేస్తాయి మన మీడియా చానెళ్లు. అయితే ఆ టైంలో ఒక్కొసారి అత్యుత్సాహమే తప్ప అందులో నిజానిజాలు వెలికి చూడవు. సరిగ్గా అలాంటి విషయమే ఇక్కడ జరిగింది. ఓ సీనియర్ నటి ఒక హోటల్ లో బ్రోతల్ కేసులో అరెస్టయ్యిందటూ ఏకంగా కొన్ని వెబ్ సైట్లు రాసిపడేశాయి. చెన్నైకి చెందిన ఈ 44 ఏళ్ల టాప్ నటి పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. గతేడాది వచ్చిన ఓ తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోకి తల్లి క్యారెక్టర్ లో మెరిసింది.

                 నిజానికి రెండేళ్ల క్రితం ఓ బెంగాలీ నటి ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఆమె పేరు కూడా ఇప్పుడు మీడియా రాస్తున్న పేరే. దీంతో ఈ చెన్నై నటిని ఆ కేసులో అరెస్టయ్యిందంటూ ఓ వెబ్ సైట్ రాసిపడేసింది. యాజ్ ఇట్ ఈజ్ గా మిగతావి కూడా అదే ఫాలో అయ్యాయి. పాడు పని చేసిందంటూ, సినీ ఇండస్ట్రీ పరువు తీసిందంటూ, ఆఫర్లు లేక ఇలా బరితెగించిందంటూ ఊదరగొట్టేసింది. గతంలో ఇలాంటి వ్యవహారంలో అరెస్టైన నటీమణుల పేర్లను ఉటంకిస్తూ ఆర్టికల్స్ రాసేశాయి.  దీంతో సీరియస్ అయిన ఆమె ఆయా వెబ్ సైట్లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైపోతుందని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ