చెర్రీ ఖాకీ అంటే కంగారుపడుతున్నారు

January 12, 2016 | 03:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
mega fans tensioned about ram charan tani oruvan remake niharonline

బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ నుంచి తేరుకున్న చరణ్, 'తని ఒరువన్' రీమేక్ కి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో తాను నటించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరింత ఫిట్ నెస్ తో కనిపించడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నాడు. తమిళ్లో జయం రవి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నాడు. తెలుగు నెటివిటికి తగ్గట్లుగా కొద్దిపాటి మార్పులు చేసి పనిలో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నాడంట. ఇందులో చరణ్ సరసన ఓ బాలీవుడ్ నటిని నటింపజేసే ప్రయత్నంలో యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

                            ఇక ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. అందువలన హెల్దీ లుక్ తో కనిపించడానికి కసరత్తును మొదలుపెట్టాడట. రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ .. డైట్ కంట్రోల్ చేస్తూ .. హెల్త్ టిప్స్ ను స్ట్రిక్ట్ గా పాటిస్తున్నాడట. తాను చేసే ఈ కసరత్తు తాలూకు వీడియోను ఫ్యాన్స్ ముందుంచుతానని కూడా ఆయన చెప్పాడు. అయితే గతంలో చరణ్ పోలీసాఫీసర్ గా నటించిన తుఫాన్ (హిందీలో జంజీర్) డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకి అసలు బాలీవుడ్ సిినిమాల జోలికి వెళ్లోద్దని చెర్రీ మెంటల్ గా ఫిక్సయిపోయాడు. అంతేకాదు ఓ క్లాసికల్ మూవీని ఖూనీ చేశాడంటూ చరణ్ పై అప్పుడు బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి పోలీస్ క్యారెక్టర్ కావటం,  పైగా రీమేక్ కావటంతో మెగా అభిమానుల్లో కాస్తంత టెన్షన్ నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ