సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యపాత్రలో 'చంద్రముఖి' సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు మణిచిత్రతజుగా మళయాళంలో, ఆప్తమిత్రగా కన్నడలో తెరకెక్కి అఖండ విజయం సాధించింది. శోభన, సౌందర్యలు ఆయా భాషల్లో అద్భుతంగా నటించగా, ఇక తమిళ్ లో జ్యోతిక ఇరగదీసింది. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి తమిళ్ తోపాటు తెలుగులోనూ రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక దీని సీక్వెల్ కన్నడలో నిర్మించగా అది కూడా బాగానే ఆడింది. అలాగే, తమిళంలో కూడా సీక్వెల్ తీయాలని అప్పట్లో రజనీకాంత్ ని దర్శకుడు వాసు సంప్రదిస్తే ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో అదే కథతో తెలుగులో వెంకటేశ్ తో సీక్వెల్ నాగవల్లిగా తీయగా అది కాస్తా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
ఇప్పుడు నాగవల్లికే కొన్ని మార్పులు చేర్పులు చేసి, తిరిగి తమిళంలో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలెట్టాడు దర్శకుడు వాసు. అందుకుగాను రజనీని మళ్లీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇదిలా ఉంచితే, ఈ సీక్వెల్ లో 'చంద్రముఖి' పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే అల్రెడీ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాను మళ్లీ తీసేందుకు రజనీ ముందుకు వస్తాడా? అది కాగా ఈ చిత్రంపై కొన్ని మూఢనమ్మకాలు కూడా నమ్ముతున్న నేపథ్యంలో రజనీ ఆ సాహసం చేయడనే అనుకుంటున్నారంతా.