ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ డైరెక్టర్ కూ, హీరోకూ నీరాజనాలు పట్టడం, ఫ్లాపయితే కరివేపాకులా తీసి పారెయ్యడం సినిమా ఇండస్ట్రీలో మామూలే. గబ్బర్‌సింగ్‌తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్, 'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాప్‌తో వెనుక పడ్డాడు. పెద్ద హీరోలతో పని చేసిన ఈయన యువ హీరోతో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' తీస్తున్నాడు. ఈ చిత్ర కథని ఎప్పుడో రాసుకున్న హరీష్ శంకర్ దీనిని పట్టుకుని చాలా మంది పెద్ద హీరోల చుట్టూ తిరిగాడట. అల్లు అర్జున్ లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇవ్వడంతో, సాయి ధరమ్ తేజ్‌తో ఈ సినిమా తీస్తున్నాడు. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రం బాగానే వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్ర కథని హరీష్ కొన్ని పాత సినిమాల నుంచి కాపీ కొట్టాడనే రూమర్ కూడా వుంది. చిరంజీవి నటించిన మొగుడు కావాలి, బావగారూ బాగున్నారా తరహాలో ఈ చిత్రం వుంటుందని టాక్. అవసరం కొద్దీ ఒక అమ్మాయికి అద్దె భర్తగా ఇందులో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడని టాక్ వుంది. మరి మొగుడు కావాలి టైప్ లోనే బావగారు బాగున్నారా? లో అద్దె మొగుడుగా వెళ్ళిన చిరంజీవిని చూసి సక్సెస్ చేసిన ఆడియన్స్ మళ్ళీ అలాంటి అద్దెమొగుడును చూడకూడదనేది ఏం లేదు కదా... చూద్దాం హరీష్ శంకర్ అదృష్టం ఎలా ఉందో?