సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాత్సవ్ ఇక లేరు

September 05, 2015 | 03:16 PM | 1 Views
ప్రింట్ కామెంట్
aadesh_srivastava_niharonline

ఆదేశ్ శ్రీవాత్సవ పుట్టింది సెప్టెంబర్ 4న అయితే ఆయన సెప్టెంబర్ 5న కన్ను మూశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించిన శ్రీవాత్సవ గత కొంత కాలంగా కేన్సర్ తో బాధ పడుతున్నాడు. శుక్రవారం అర్థ రాత్రి ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో ఆయన మృతి  చెందాడు. ఈయన గురించి ఎ.ఆర్.రెహమాన్ బాధ పడుతూ తన తోటి సంగీత దర్శకుడి స్థితి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం ఓ సందేశం పెట్టాడు. అలా ఆయన సోషల్ నెట్వర్క్ లో మెసేజ్ పెట్టాడో అదో మరో రెండు రోజులకే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశాడు. బాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా అనేక సినిమాలకు పని చేసిన సీనియర్ సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాస్తవ క్యాన్సర్ తో పోరాడి ఓడిపోయాడు. ఆదేశ్ కు ఐదేళ్ల క్రితమే క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. ఐతే చికిత్స తీసుకున్నాక కోలుకున్నాడు. కొన్ని సినిమాలకు కూడా పని చేశాడు. ఐతే మళ్లీ ఆ మహమ్మారి తిరగబెట్టడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత 42 రోజులుగా ఆదేశ్ ముంబయిలోని కోకిలా బెన్ ధీరూబాయి అంబాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన వారం రోజులుగా తీవ్ర అస్వత్థతకు గురయ్యాడు. రెహమాన్ ఈ విషయం చెప్పడం ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థతి బాగాలేదని చాలా మందికి తెలిసింది. అందరూ తేరుకునే లోపు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. తొలిసారి క్యాన్సర్ గురించి తెలిశాక ఆదేశ్ తన జీవనశైలిని ఎంతో మార్చుకున్నాడు. మద్యం ధూమపానం వదిలేశాడు. యోగా ప్రాక్టీక్ చేశాడు. ఓ దశలో అతను చికిత్సకు డబ్బుల్లేక తన ఆస్తుల్ని కూడా అమ్ముకున్నట్లు సమాచారం. చల్తే చల్తే, భాగ్ బన్ కభీ ఖుషీ కభీ గమ్, రాజ్ నీతి లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఆదేశ్ సంగీతాన్నందించాడు. దాదాపు 100 సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ