క్రిస్మస్‌కి ‘పటాస్‌’

December 06, 2014 | 03:48 PM | 36 Views
ప్రింట్ కామెంట్

ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా కళ్యాణ్‌రామ్‌కు ‘అతనొక్కడే’ తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ మళ్ళీ రాలేదు. బాబాయ్‌ బాలకృష్ణ తమ్ముడు ఎన్టీఆర్‌తో సినిమాలు తీయడానికి వాళ్ళు డేట్స్‌ ఇవ్వడం లేదు. అందుకే తన సత్తా చూపడానికి ‘‘పటాస్‌’’గా క్రిస్మస్‌కు వస్తున్నాడు. ఈ మూవీలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న కళ్యాణ్‌ విలన్స్‌పై సరదా సెటైర్స్‌ వేస్తూ కామెడీ పంచెస్‌ కూడా వేస్తాడని టాక్‌. కానీ హీరో రోల్‌.. ‘గబ్బర్‌సింగ్‌’ లో పవన్‌ను, ‘ఆగడు’ లో మహేష్‌ను ఇమిటేట్‌ చేస్తూ నడుస్తుందని తెలుస్తోంది. ‘ఆగడు’ రైటర్‌ అనిల్‌ రావిపూడి డైరెక్టర్‌గా టర్న్‌ తీసుకున్న ఈ మూవీకి కూడా కాపీ మరకపడి ‘ఆగడు’ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుందా లేక గబ్బర్‌లా హిట్‌ కొడతాడా అనేది అనిల్‌ టేకింగ్‌లో ఉందని ఫిల్మ్‌ నగర్‌ గుసగుస. ‘రౌడీ ఇన్స్పెక్టర్‌’ ‘‘ అరె ఓ సాంబా ’’ సాంగ్‌ను రీమిక్స్‌గా వాడిన పటాస్‌ టీమ్‌ బాలకృష్ణను బానే వాడేసి నందమూరి ఫ్యాన్స్ లో జోష్‌ పెంచే పనిలో ఉన్నారని, ఈవారం ఆడియో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారని అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ