పెళ్ళిపిలుపు: మోదీతో మంచు ఫ్యామిలీ

April 21, 2015 | 02:47 PM | 49 Views
ప్రింట్ కామెంట్
modi_with_manchu_family_niharonline

మంచు మోహన్ బాబు చిన్నబ్బాయి మనోజ్ పెళ్ళి పిలుపు కోసం ఈ ఫామిలీ ప్రధాన మంత్రి మోడీని మంగళవారం కలిసింది. ఆయనను మనోజ్ పెళ్ళికి తప్ప కుండా రావాలని ఆహ్వానించారు మోహన్ బాబు. ఈ విషయాల గురించి మోహన్ బాబు మాట్లాడుతూ- మోడీని కలవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని,చాలా ఏళ్ల క్రితమే తనకు బీజేపీ నుండి ఆహ్వానం వచ్చిందన్నారు. మోడీని కలవడం గర్వంగా ఉందని మనోజ్, విష్ణు,మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మనోజ్-ప్రణతివివాహం మే 20న 9.10కి జరగనుంది. ఈ రోజున మరో ప్రత్యేకత ఉంది మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ఈ సందర్భంగా మోహన్ బాబు తన కోడళ్ళ గురించి చెప్పుకొచ్చాడు. 'మా పెద్ద కోడలు విరోనికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంట్ ని సిపీఎ అంటారు) చేసింది. రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలను కలిసి వివాహ విషయం మాట్లాడాం. మీ అందరి ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది' అని చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ