లక్ష్మి మంచు –అడవి శేష్ నటీనటులుగా వంశీ క్రుష్ణ దర్శకత్వంలో తీసిన దొంగాట సక్సెస్ మీట్ నిర్వహించారు. తమ మూవీ సక్సెస్ సందర్భంగా పలువురు ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ తమ ఆనందం వ్యక్తం చేసుకున్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో పాలు పంచుకున్న ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు సినీ పరిశ్రమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదం’టూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘తానెప్పుడూ చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని, చిన్న సినిమాలు తీసే వాళ్లే అసలైన నిర్మాతలు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిశ్రమలో మంచి నిర్మాతలు తగ్గిపోయారని, కొందరు పైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి నటులకు డబ్బులు ఎగ్గొడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘అలాంటి వాడు నిర్మాత కాదు..దొంగ, లఫూట్’ అంటూ ఫైర్ అయ్యారు. ‘దౌర్జన్యాలు చేసే వారు కాలగర్భంలో కలిసి పోతా’రన్నారు. కొందరు దర్శకులు సైతం నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఎవరిని నిందిస్తున్నాడనేది అర్థం కాక ఈ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ టాపిక్ అయి కూర్చుంది.