సుప్రీం తీర్పు: మోహన్ బాబుకు పద్మశ్రీ కొనసాగింపు

August 03, 2015 | 02:50 PM | 3 Views
ప్రింట్ కామెంట్
mohan_babu_padmsri_continued_niharonline

‘పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేశాడనే అరోపణపై అవార్డును తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో  మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘పద్మశ్రీ' అవార్డును మరెప్పుడూ దుర్వినియోగం చేయబోనని సుప్రీం కోర్టుకు ఆయన విన్నవించుకోవడంతో మోహన్ బాబుకు పద్మశ్రీ కొనసాగించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది.
ఈ వివాదంలోకి వెళితే... అప్పట్లో బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మోహన్ బాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు లేఖ పంపారు.  మోహన్ బాబు తన లెటర్ పాడ్‌లో , లేదా ఉత్తరప్రత్యుత్తరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ బిరుదును ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో కూడా మోహన్ బాబు పేరు ముందు పద్మశ్రీ అని వేసారు. పేరుకు ముందు లేదా తర్వాత పద్మశ్రీ బిరుదును ప్రస్తావించి ఇతర ప్రయోజనాలకు వాడుకోరాదని గతంలో సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిందని, కాని మోహన్ బాబు ఇది పాటించడం లేదంటూ ఇంద్రసేనారెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. ఈ కేసును విచారించిన హైకోర్టు మోహన్ బాబును ‘పద్మశ్రీ' అవార్డును తిరిగి ఇచ్చివేయాలని ఆదేశించింది. దీంతో మోహన్ బాబు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు తుది విచారణలో పద్మశ్రీ అవార్డును మరెప్పుడూ దుర్వినియోగం చేయబోనని సుప్రీం కోర్టుకు మోహన్ బాబు విన్నవించడంతో సుప్రీం కోర్టు ఆయన ఊరట కల్పిస్తూ ఆయనకు వచ్చిన పద్మశ్రీని కొనసాగించవచ్చునని తీర్పు ఇచ్చింది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ