లేడీ డాన్ దావూద్ చెల్లెలు తెరమీదకు...

August 03, 2015 | 01:19 PM | 4 Views
ప్రింట్ కామెంట్
sonakshi_haseena_apurwa_lakhiya_movie_niharonline

డాన్ కథలతో పుంఖాను పుంఖాలుగా సినిమాలు వచ్చాయి. అమితాబ్ ‘డాన్’ సినిమాకు ముందు తరువాత కూడా ఇలాంటి కథలు ఎన్ని వచ్చినా సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఈ కథలకు అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీం లాంటి వారి చరిత్రలే ఇతి వృత్తాలవుతున్నాయి. ఇక దావూత్ తో టచ్ లో ఉన్న స్నేహితులు, బంధువులు కూడా సినిమా కథా వస్తువులే... అలా   ఇప్పుడు అతడి చెల్లెలు జీవితం కూడా వెండితెరపైకి రాబోతోంది.. ‘జంజీర్’ ఫేం అపూర్వ లఖియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రంలో దావూద్ సోదరి హసీనా క్యారెక్టర్ గురించి చెప్పబోతోందట. దీనికి ‘ది క్వీన్ ఆఫ్ ముంబై’ అనే టైటిల్  తీసుకుంటున్నారు. సోనాక్షి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అసలింతకీ హసీన ముంబై లో ఏం చేసేది? అనేది ఈ ఆటోబయోగ్రఫీ లో చెప్పబోతున్నామని అపూర్వ లాఖియా చెబుతున్నారు. హసీన జీవితం పూర్తి ఎమోషనల్. ఓ వైపు అన్న పెద్ద డాన్. అతడికి చెల్లిగా ముంబైలో బతకాలంటే తను అంతకుమించిన డాన్ అయితేనే సాధ్యం. అందుకే ముంబై లోని ఓ ఏరియాలో ఈవిడను క్వీన్ గా ఆరాధించేవారు. దావూద్ ఇబ్రహీంకి ఉన్న 12 మంది అక్కా చెల్లెళ్ళలో హసీన పార్కర్ ఒక సోదరి. ముంబై నాగ్ పడ ప్రాంతంలో నివసించేది. అక్కడ తనకి ఎంతో మంది అభిమానులు, అంతే మంది శత్రువులు కూడా ఉండేవారు. అలాంటిచోట రాణిలా ఎలా బతికింది అన్నది హసీన ‘ది క్వీన్ ఆఫ్ ముంబై’ చిత్రంలో చూపించనున్నారు. హసీన 40ఏళ్ల వయసప్పుడు గుండెపోటుతో మరణించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారు. ఈ క్యారెక్టర్ సోనాక్షి జీవితానికి పూర్తిగా భిన్నంగా ఉండడంతో తను దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తానంటోంది సోనాక్షి సిన్హా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ