త్రిషకు సూపర్‌ కాంప్లిమెంట్‌

December 06, 2014 | 04:46 PM | 35 Views
ప్రింట్ కామెంట్

త్రిష అందంపై తమిళ హాస్య నటుడు వివేక్‌ సూపర్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడు. త్రిష ప్రస్తుతం అజిత్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్నై అరిందాల్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో వివేక్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు త్రిష అందం గురించి చెబుతూ, ‘‘ఇప్పటి వరకు త్రిషతో కలసి నేను నటించిన అన్ని సినిమాలలోకీ ఈ ‘ఎన్నై అరిందాల్‌’ సినిమాలో త్రిష సౌందర్యరాశిగా కనిపిస్తుంది. త్రిష తొలి సినిమా ‘లేసా లేసా’లో కూడా నేను నటించాను. అప్పుడెలా కనిపించిందో ఇప్పటికీ అదే అందం ఆమెలో తొణికిసలాడుతోంది’’ అంటూ కాంప్లిమెంట్‌ చేస్తున్నాడు. దీంతో ఈ చెన్నై చిన్నది చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు.. వివేక్‌ మంచి మనసుకు థ్యాంక్స్‌ కూడా చెప్పింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ