మోస్ట్ డిజైరబుల్ హీరో పెళ్ళి చేసుకున్నాడా?

April 29, 2015 | 12:43 PM | 34 Views
ప్రింట్ కామెంట్
rana_marriage_is_it_shooting_or_real_niharonline

అసలే అమ్మాయిల కలల రాకుమారుడు. ఆరడుగుల అందగాడు. మూవీ మోఘల్ మనుమడు, మోస్ట్ డిజైరబుల్ బ్యాచిలర్. ఈయనకు పెళ్ళంటే ఎంత మంది అమ్మాయిలు దేవదాసీలవుతారు? అది కూడా ఎలాంటి ముందు వార్త లేకుండా....?  మరి... ఇలా  పెళ్లికొడుకు అవతారంలో కనిపించి అందరికి షాకిచ్చాడు. సరే... ఇది నిజమైన పెళ్ళి కాదనుకోండి... ఈ స్టిల్స్ చూస్తే రానాను అభిమానించే అమ్మాయిలు మాత్రం కాస్సేపు టెన్షన్ పడి తీరుతారు.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ రీమేక్ షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ఈ తమిళ రీమేక్ ను నిర్మిస్తున్నారు. ఈ తమిళ రీమేక్ కు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీదివ్య, లక్ష్మీ రాయ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే రానా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇందులోనే రానా పెళ్ళి చసుకుంటున్నాడు. ఇవే ఆ స్టిల్స్. ఈ చిత్రానికి ‘బెంగళూర్ డేస్’ కు సంగీతం అందించిన గోపిసుందర్. సంగీతం అందిస్తున్నాడు. తెలుగు వర్షెన్ కు ‘ఓమైఫ్రెండ్’ చిత్ర ఫేం వేణుశ్రీరాం దర్శకత్వం వహించనున్నాడు. తెలుగులో శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్‌, శ్రీదివ్యలు నటిస్తున్నారట. త్వరలో మరికొన్ని వివరాలతో అధికారికంగా ప్రకటించనున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ