కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో అక్కినేని మూడో తరం వారసుడిగా చిత్ర సీమకి పరిచయమైన యంగ్ హీరో సుశాంత్. ప్రతి సినిమాకి గ్యాప్ తీసకున్న ఈ కుర్ర హీరో అడ్డా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. డెబ్యూ మూవీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌తో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ మేర్ల పాక గాంధీ దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్క నుంది. ఈ విషయాలన్నీ ఎప్పటి నుండో ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలకు బలాన్ని చేకూర్చే విధంగా ఈ చిత్రాన్ని సుశాంత్ బర్త్ డే సందర్భంగా మార్చి 18న ప్రాంభిస్తారట. అన్న పూర్ణ స్టూడియో బ్యానర్ సమర్ప ణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై శ్రీమతి ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావులు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.