తాను తెలుగు హీరోనంటున్న సిద్ధార్థ్

April 15, 2015 | 02:59 PM | 44 Views
ప్రింట్ కామెంట్
Naalo_Okkadu_Movie_Audio_niharonline

ఇటీవల కాలంలో సిద్ధార్థ డైరెక్ట్ తెలుగు సినిమాలు తగ్గిపోయాయి. ఓ మై ఫ్రెండ్, సంథింగ్... సంథింగ్... ఫ్లాప్  కావడంతో తమిళ చిత్రాలవైపుకు మనసు మళ్ళించాడు. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా ఎనకుల్ ఒరువన్ అనే తమిళ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. ఇందులో ‘కలలో జరిగిందే నిజం అనుకునే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశంతో తీశారు. దీనికి ‘నాలో ఒకడు' అనే టైటిల్ ను ఇచ్చారు. ప్రసాద్ రమర్ దర్శకత్వంలో సిద్ధార్ధ్ , దీప సన్నిధి జంటగా నటించారు.  సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎనకుల్ ఒరువన్' ని కల్పన చిత్ర పతాకంపై, కోనేరు కల్పన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో విడుదలై అన్ని చోట్లా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో తెలుగులో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా పాటలను  ఏప్రిల్ 14న ఆడియో విడుదల చేసారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ... ‘నన్ను హీరోని చేసింది తెలుగు ప్రేక్షకులే. ఇపుడు ఈ స్థాయిలో ఉన్నానంటే... తెలుగు వారి చలవే. నాకు డబ్బులు ఇచ్చింది తెలుగు వారే. అందుకే నేను ఎక్కడికెళ్లినా తెలుగు హీరోననే చెప్పుకుంటాను. ‘నాలో ఒకడు' సినిమాను చాలా కష్టపడి చేశాను. ఊరి నుంచి వచ్చిన కుర్రాళ్ళు తమ కలల్లో ఎలా ఉండాలనుకుంటాడో అలాంటి సినిమా ఇది. ఈ సినిమా కన్నడలో చూసి, ఆ సినిమాను కొనడానికి వెళ్ళాననీ, అప్పటికే ఎవరో కొన్నారని తెలిసి, వారి వద్దకు వెళ్ళి, ఈ సినిమాన నేను చేస్తానని, బెగ్గింగ్ టైపులో అడిగితే ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు’ అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి మంచు లక్ష్మి, దర్శకుడు ప్రసాద్ రమర్, రానా, సందీప్ కిషన్, నాని, సంగీత దర్శకుడు, సంతోష్ నారాయణ్ తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ