’సోగ్గాడే చిన్ని నాయన’లో ఫాంటసీ

December 06, 2014 | 03:27 PM | 15 Views
ప్రింట్ కామెంట్

పాత సినిమా పాటలే కొత్త సినిమాల పేర్లు ఇప్పుడు. ఆ తరహాలో పెట్టిన పేరు 'సోగ్గాడే చిన్ని నాయన'. నాగార్జున హీరోగా చేస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే కొత్త వినవచ్చిన మాట ఏమిటంటే దీనిలో ఫ్యాంటసీ జోడించారన్నది. 1983లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'శ్రీరామ రక్ష' చిత్ర కథ ఛాయల్లో ఇప్పుడీ చిత్ర కథ సాగుతుందని అంటున్నారు. ఆ సినిమాలో కూడా ఏఎన్నార్ రెండు పాత్రలు వేశారు. చనిపోయిన పాత్ర ఆత్మ రూపంలో వచ్చి మరో పాత్రకు సహాయం చేస్తుంటుంది. ఇదే పాయింటును ఇప్పుడు 'సోగ్గాడే'లో కూడా పెట్టినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. నాగ్ కు హీరోయిన్లుగా ఇందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు నటిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ