తాజాగా షూటింగ్ జరుపుకుంటున్న నాగ చైతన్య సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాని విషయం అందరికీ తెలిసిందే. సినిమా పేరు లేకుండానే టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా టైటిల్ పై బ్రహ్మానందం సెటైర్లు కూడా వేశారు. మోసగాడు, మాయగాడు వంటి పేర్లను పెట్టవచ్చని కూడా అనుకున్నారు. అయితే దీనికి దోచెయ్ అనే టైటిల్ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఫిలిం ఛాంబర్ లో నమోదు చేసుకున్నట్టు కూడా తెలిసింది. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మోసం చేసే వాళ్లని... ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యువకుడిగా నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి దోచెయ్ పేరు బాగుంటుందని అనుకోవడంతో ఆ పేరునే ఫైనల్ గా నిర్ణయించారు.