దాసరి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున చేసిన రెండో సినిమా మజ్ఞు. ఈ సినిమాను మ్యూజికల్ గానూ కథా పరంగా నాగార్జునకు మంచి హిట్. తండ్రి నాగేశ్వర్ రావు దేవదాసు లాంటి సినిమాను తనయునితో మజ్ఞుగా చేసిన దాసరి ప్రయత్నంగా అనిపించింది. అయితే ఈ సక్సెస్ టైటిల్ ను ఇప్పుడు నాగార్జున తనయుడు నాగచైతన్య సినిమాకు వాడుతున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే నాగచైతన్య కి తండ్రిగా అలనాటి 'మజ్ను' నాగార్జున కూడా నటిస్తున్నాడట. ఆ 'మజ్ను' విషాదంతం కాగా ఈ మజ్ఞు వినోదాత్మకం అంటున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ లో మేనమామ వెంకటేష్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మలయాళంలో విజయవంతమైన 'ప్రేమమ్' కు రీమేక్ అన్న విషయం ఇంతకుముందే వార్తల్లో వచ్చింది. తొలిసారిగా నాగచైతన్య శ్రుతి హాసన్ తో జత కడుతున్నాడు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.