టాప్ కమెడియన్ కుమారుడి కన్నుమూత

October 30, 2015 | 11:04 AM | 7 Views
ప్రింట్ కామెంట్
vivek_son_prasanna_died_niharonline

తెలుగువారికి సుపరిచితుడైన ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ కి పుత్రశోకం కలిగింది. ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ (13) తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన కుటుంబంలో పెను విషాదంలో కూరుకుపోయింది. నెల రోజులగా ప్రసన్నను బ్రెయిన్ ఫీవర్ పీడిస్తోంది. దీంతో అతన్ని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేర్పించారు. నెల నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ప్రసన్న కోలుకోలేక మరణించాడు.

ఇక వివేక్ కుమారుడి మరణ వార్తతో అటు తమిళ, ఇటు తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని తెలిపారు. కుష్బూ, ప్రసన్న లాంటి నటులు సోషల్ మీడియాలో తమ విచారాన్ని వ్యక్తంచేశారు. ఎప్పుడూ తన హాస్యంతో అందరినీ అలరించే వివేక్, కుమారుడి మృతిని తట్టుకోలేక బోరున విలపించడం పలువురిని కదిలించింది. ఈ సమయంలో మీడియా తనకి కాస్త దూరంగా ఉండాలని విజ్నప్తి చేశారు.  కాగా వివేక్ చెలి, వాలి, అపరిచితుడు, శివాజీ, తదితర చిత్రాలతో హాస్యాన్ని ఓరేంజ్ లో పండించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ