1949లో రిలీజై తెలుగు వాళ్ళ మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన చిత్రం లైలా-మజ్ను. అప్పట్లో ఓ భగ్న ప్రేమికుడిగా నటించాలంటే అక్కినేని నాగేశ్వర్ రావును మించిన వాడు లేడని ఆయన నటించిన లైలా-మజ్ను, దేవదాసుల ద్వారా నిరూపించుకున్నాడు. ఈ రెండు చిత్రాలను మిక్స్ చేస్తూ ఓ కొత్త కథతో అప్పటి జనరేషన్ కు నచ్చేలా నాగార్జునతో మరో ‘మజ్ను’ను తీసి హిట్ చేశారు దాసరి నారాయణ రావు. ఆ తాత, తండ్రుల బాటలో ఇప్పుడు చై కూడా కొత్త ప్రేమ కథతో ‘మజ్ను’గానే వచ్చేస్తానంటున్నాడు,
నాగచైతన్య ఇటీవల మళయాళంలో విడుదలై హిట్ సినిమా ప్రేమమ్ రీ మేక్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాని మన తెలుగు వారికి చూపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చందూ మొండేటి దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాలో కథానాయికగా ‘ప్రేమమ్’ చిత్రంలో నటించిన హీరోయిన్నే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథ హీరోహీరోయిన్ల ప్రేమ స్కూల్లో చదువుతున్నప్పుడే చిగురిస్తుందట. ఈ చిత్రం టైటిల్ కోసం ఎంతో ఆలోచించి.... చివరగా ‘మజ్ను’