పాత తరం రోజుల్లో హీరో హీరోయిన్లను మద్దాడాలంటే ఏ చెంప మీదనో, నుదుటి మీదనో ఇచ్చి ముచ్చట కానిచ్చుకునేవారు. రాను రాను ముఖానికి జుట్టు అడ్డుగా పెట్టి కేవలం కళ్ల ఎక్స్ ప్రెషన్ లతోనే కానిచ్చేవారు. అయితే హాలీవుడ్ ఇన్సిపిరేషన్ నుంచి బాలీవుడ్ కి , అక్కడి నుంచి ఇతర ఉడ్ లకు ఈ లిప్ లాక్ లు చేరిపోయాయి. ఇక బాలీవుడ్ లో బెడ్ సీన్లు ఎక్కువై పోయినప్పటికీ విలువలు పాటిస్తూ మనోళ్లు ఇంకా కేవలం ముద్దులతోనే నెట్టుకొస్తున్నారు.
అయితే పెద్దహీరోలతోకాకుండడా చిన్న హీరోలతోనే ఈ తంతును కానిస్తే యూత్ లో మంచి క్రేజ్ వస్తుందని భావించే దర్శకులు అవసరం లేకపోయినా కొన్ని సినిమాల్లో ఈ సన్నివేశాలను ఇరికించేస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలకైతే ఇది కంపల్సరీ అయిపోయింది. వీళ్లలో నాగశౌర్య కైతే మరీ ఎక్కువ. నాగశౌర్య చందమామ కథలుతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఊహలు గుస గుసలాడే, దిక్కలు చూడకు రామయ్యతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే చాక్లెట్ కుర్రాడిగా పేరుపడిన ఇతడితో లిప్ లాక్ లు పెట్టిస్తే వర్కవుట్ అవుతుంది అనుకుంటున్నారేమో దర్శకులు ప్రతీ సినిమాల్లో లిప్ లాక్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఆ మధ్య జాదుగాడులో సోనారిక పెదాలను జుర్రెసిన శౌర్య, తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న అబ్బాయి తో అమ్మాయి చిత్రంలోనూ ఫలక్ లల్వానీ అనే కొత్త అమ్మడితో లిప్ లాక్ లు పెట్టాడట. ఇక ఇప్పుడు తాజాగా నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చే ఓ చిత్రంలోనూ నాగ్ శౌర్యకు మరో మూతి ముద్దుని ఇరికించిందట. ఇక నాగ్ కూడా సిగ్గు లేకుండా పెదాలను ముద్దాడేందుకు ఎగబడిపోతున్నాడట. లక్కీ ఫెల్లో... అయినా ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి?