శ్రీనువైట్ల రామ్ చరణ్ కాంబినేషన్ రాబోతున్న బ్రూస్ లీ కోసం మెగా అభిమానులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. కారణం 8 ఏళ్ల నిరీక్షణ. మెగాస్టార్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలిసిందే. దీనికి తోడు ఓ పాట, కాసేపు స్క్రీన్ పై కూడా అలరిస్తాడని సమాచారం. అయితే ముందుగా ఆ ఐటెం సాంగ్ కోసం గోవా బ్యూటీ ఇలియానాని అడిగారట. అయితే ఇలియానా పారితోషకంతో కళ్లు తిరిగిన నిర్మాతలు సైలెంట్ అయిపోయారని సమాచారం. తాజాగా మంచి డాన్సర్ కావటంతో తమన్నాని అడిగినట్లు, దానికి తమన్నాకూడా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలు ఉత్తదే అని తేల్చింది మిల్కీ బ్యూటీ.
బ్రూస్ లీ సినిమాలో నన్ను ఎవరూ కాంటాక్ట్ కూడా చేయలేదు. అంతా ఫేక్ న్యూస్.. అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. మరి చిరుతో స్టెప్పులేసేది తమ్ము కాకపోతే ఇంకెవరు. దీనిపై చిత్ర యూనిట్ అయినా క్లారిటీ ఇస్టే బావుండును.