అక్కినేని మూడో తరంలో చాలా మంది నటులు సినిమా రంగంలో తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. వారిలో అక్కినేని తనయు నాగసుశీల తనయుడు సుశాంత్ ఒకడు. ‘కాళిదాసు’, ‘కరెంట్’ చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరో దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘అడ్డా’(2013) సినిమా చేసి కమర్షియల్ గా సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత మధ్యలో రెండు, మూడు సినిమాలు ప్లాన్ చేసినా వర్కవుట్ కాకపోవడంతో దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుశాంత్ హీరోగా శ్రీ నాగ్ కార్పొరేషన్ బ్యానర్ లో సినిమా రూపొందనుంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సక్సెస్ కొట్టిన మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. త్వరలోనే హీరోయిన్ మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తారు.