నాగచైతన్య సినిమాలకు సంబంధించిన వార్తలేవీ ఈ మధ్య వెలువడుతున్నట్టు కనపడటం లేదు. ఆ మధ్య ’స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మళ్ళీ మధ్యలో షూటింగ్ కు సంబంధించిన ఏ వార్తలు రాకపోవడంతో ఈ షూటింగ్ జరుగుతోందా? లేక ఆగిపోయిందా అని నాగచైతన్య అభిమానులు తర్జనబర్జనలు పడుతున్న సమయంలో ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. పాటలు, క్లైమాక్స్ సీన్స్ పూర్తి కావాల్సి ఉంది అని వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్ అదిరిపోయే విధంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసారు. టైటిల్ ఇంకా అపీషియల్ గా ఖరారు కాలేదు. ఈ సినిమా ప్రొడక్షన్ టీం తమ బ్యానర్ లో ‘దోచెయ్' అనే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసారు. దానికి తోడు ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కూడా దొంగే కావడంతో ‘దోచెయ్' అనే టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు. ''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్ వర్మ. కృతి సనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.