బాలీవుడ్ హీరో సాహసం

February 09, 2015 | 04:11 PM | 46 Views
ప్రింట్ కామెంట్
FarhanAkhtar_real_hero

షూటింగ్ లలో హీరోలకు విలన్స్ కు చాలా ప్రమాదాలే జరుగుతుంటాయి. రీల్ మీద హీరోయిజం ప్రదర్శించే హీరోలకు నిజంగా ఏ చిన్న దెబ్బ తగిలినా బెంబేలెత్తి పోతుంటారు. కొందరు హీరోలయితే చాలా పిరికివాళ్ళుంటారు. ఏ కొందరు రీల్ లైఫ్, రియల్ లైఫ్ దగ్గరి సంబంధం ఉంటుంది. అయితే తీవ్రమైన అలల ఒత్తిడిలో ఉన్న సముద్రానికి ఎదురీది తమ సినిమా యూనిట్ సభ్యుడిని కాపాడిన ఒక బాలీవుడ్ హీరో చేసిన సాహసం ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ఈ సాహసానికి పూనుకున్నాడు. ‘3 ఇడియట్స్’, ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో ఇతడు. ఫర్హా అక్తర్ ‘దిల్ దడ్కనే దో’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం టర్కీలోని ఒక సముద్ర తీరంలో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కు కోసం ఫర్హాన్ అక్తర్ దర్శన్ అనే హెయిర్ డ్రెస్సర్ ను ముంబాయి తీసుకు వెళ్ళాడు. దర్శన్ అక్కడ సముద్రాన్ని చూసే సరికి ఈత కొట్టాలనిపించి వెళ్ళాడట. ఒకేసారిగా అలల మధ్య చిక్కుకు పోవడంతో దర్శన్ సముద్రంలో మునిగిపోయాడు. ఈ పరిస్థితిను సముద్రపు ఒడ్డున చూస్తున్న యూనిట్ సభ్యులు కేకలు వేశారు. అతన్ని కాపాడడానికి ఫర్హాన్ అక్తర్ అలలకు ఎదురీదుతూ వెళ్ళి దర్శన్ ను లాక్కుని వచ్చాడు. ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో ఫర్హాన్ అక్తర్ రియల్ హీరో అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ