మూడేళ్ళుగా సినీ అభిమానుల్లో క్యూరియాసిటీని నింపిన బాహుబలి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో సంచనాలను సృష్టిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను ఇప్పటికే 30 లక్షల మంది తిలకించారు. ఇక ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా స్పీడ్ అందుకునే దిశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను ఏరియా వైజ్ గా ఎగరేసుకుపోతున్నారు. ఇంత వరకూ ఏ సినిమాకూ లేనంత భారీ మార్కెట్ ఈ సినిమాకు జరుగుతోంది. ఈ సినిమా కృష్ణ జిలాల హక్కుల్ని 3.96 కోట్ల కు నాగార్జున సొంతం చేసుకున్నారు. ఇంతవరకూ ఈ జిల్లాలో ఈ రేంజ్ బిజినెస్ ఎప్పుడూ జరగలేదంటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక రికార్డు అనుకుంటున్నారు. పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా 3.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే నాగ్ చెల్లించిన మొత్తం కన్నా ఇది తక్కువే. ఈ సినిమా తెలుగులో మాత్రమే 100 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇండియా మొత్తంలో ఎంత వసూళ్ళు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో... ఈ సినిమా విడుదలయ్యాక గానీ తెలియదు.