టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతిలా హీరో ఇమేజ్ సంపాదించేసుకుంది అనుష్క. ఆమె నటించిన బాహుబలి, రుద్రమదేవి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్న అనుష్కకు మరో డిఫరెంట్ మూవీ సైజ్ జీరో. ఇలాంటి సాహసం ఇప్పటి వరకూ ఏ హీరోయిన్నూ చేయలేదు. మరెవరినైనా అడిగినా చేసేవారు కాదేమో... ఎందుకంటే నటనలో డెడికేషన్ ఉన్న నటి కాబట్టి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఏకంగా 25 కేజీలకు పైనే బరువు పెరిగి సంచలనంగా నిలిచారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత అంతటా సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఈ క్రేజ్‌ను మరింత పెంచేలా సైజ్ జీరో సినిమాలో కింగ్ నాగార్జున ఓ గెస్ట్ రోల్ చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. సైజ్ జీరోలో ఓ కీలక నేపథ్యంలో వచ్చే ఒక అతిథి పాత్రలో నాగ్ కనిపించనున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది. ఇక తెలుగులో నాగార్జున చేస్తోన్న గెస్ట్‌రోల్‌ను తమిళ వర్షన్లో జీవా చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసిన సైజ్ జీరో యూనిట్, నాగార్జున కోసం ఈ పార్ట్‌ను కొంతకాలం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిన్న పార్ట్ షూట్‌ను పూర్తి చేయనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో నవంబర్ 1న విడుదల కానుండగా, నవంబర్ 27న సినిమా విడుదల కానుంది.