నాగార్జున తన రెండవ తనయుడిని సినిమాకు ఓ మంచి కమర్షియల్ మూవీతో పరిచయం చేయాలని చాలా జాగ్రత్తలు తీసుకొని చివరికి వివి వినాయక్ కు ఈ సినిమాను అప్పగించాడు. ఈ చిత్రానికి యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. అయితే అఖిల్ సినిమా ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున అంత సంతృప్తి పడలేదని తెలుస్తోంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తీశారు. సినిమాలో భారీగానే గ్రాఫిక్స్ ఉన్నాయట. సినిమాను అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి చేసుకున్నా గ్రాఫిక్స్ మాత్రం కావాల్సిన విధంగా రాలేదని టాక్. దీంతో నాగార్జున, దర్శకుడు వివినాయక్ గ్రాఫిక్స్ విషయంలో మార్పులు చేయాలనుకుంటున్నారట. అయితే నిర్మాత నితిన్ మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ పై సంతృప్తిగానే ఉన్నాడని, ఎలాగైనా సినిమాను దసరాకి విడుదల చేయాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో మళ్లీ మార్పులు చేస్తే సినిమా విడుదల లేటవుతుందని, దసరా రేసు నుండి అఖిల్ తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరో వైపు డిస్ట్రిబ్యూటర్స్ నుండి కూడా సినిమాను దసరాకే విడుదల చేయాలని ప్రెషర్ పెరుగుతోందట. ఒక వేళ సినిమాను దసరాకు విడుదల చేయకుంటే.... ముందుగా మాట్లాడుకున్న అమౌంట్లో కేవలం 70శాతం మాత్రమే చెల్లిస్తామని అంటున్నారట. దీంతో నిర్మాత ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సినిమాను దసరాకే విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఖిత్ తొలి సినిమా కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని, తొలి సినిమా దెబ్బకొడితే అఖిల్ కెరీర్ మీద ప్రభావం చూపుతుందని నాగార్జున వర్రీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి అఖిల్ దసరా బరిలో ఉంటాడో లేదో వేచి చూడాల్సిందే.