అక్కినేని నాగార్జున నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా ఇందులో నాగార్జునను చూస్తుంటే ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, జానకిరాముడు, అల్లరి అల్లుడు నాగార్జున సినిమాలు కొన్ని గుర్తుకు వస్తున్నాయి. అప్పటి ఆ నాగార్జున మళ్ళీ కనిపిస్తున్నాడు ఈ సినిమాలు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం వర్కింగ్ స్టిల్స్ కొన్ని అక్కినేని నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఇందులో కనిపిస్తున్న కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తుంటే నాగార్జున జోరు మామూలుగా లేదనిపిస్తోంది. తనయులతో సమానంగా సినిమాల్లో ఇరగదీసేస్తున్నాడు. కేవలం ఫైట్స్ తోనే కాదండోయ్ హీరోయిన్లతో రొమాన్స్ చూడండి... మెయిన్ రోల్స్ రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలకు పక్కన పెడితే ఇంకా అనసూయతో, హంసానందినితోనూ చిందులేసేస్తున్నాడు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తొలిసారిగా ‘సోగ్గాడే చిన్నినాయనా' ఫుల్ కామెడీ చిత్రంలో తాను నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు పాత్రల్లో తేడాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని తెలిపారు.
ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూరు తదితర ప్రాంతాల్లో 25రోజుల పాటు ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యాత్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, సంపత్, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, అనసూయ, దీక్షాపంత్, బెనర్జీ, సురేఖావాణి, దువ్వాసి, రామరాజు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, కెమెరా: పి.ఎస్.వినోద్, సిద్ధార్ధ్ రామస్వామి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు, దర్శకత్వం: కళ్యాణకృష్ణ.