అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘సొగ్గాడే చిన్ని నాయన’ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఇందులో ఓ ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరించి, షూటింగ్ మొత్తం పూర్తి చేసారు. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అప్పుడు నటించిన హలో బ్రదర్ లోనూ రమ్యకృష్ణ నటించింది. ఇప్పుడు నటించే ఈ డ్యుయెల్ రోల్ చిత్రంలో కూడా రమ్య కృష్ణ నటిస్తోంది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత కూడా ఈ ఇద్దరి కాంబినేషనల్ లో సినిమా రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీలు నటిస్తోంది. సోషియో ఫాంటసీ తరహాలో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాధామోహన్ కథ, స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.