సింగం 3 కి రంగం సిద్ధం

July 08, 2015 | 04:19 PM | 1 Views
ప్రింట్ కామెంట్
surya_singam_3_niharonline

తమిళ హీరో సూర్య నటించిన సింగం సక్సెస్ అందిస్తుండడంతో వరుసగా రెండు చిత్రాలు నిర్మించి ఇప్పుడు సింగం 3కి కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో సింగం-3 షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. సింగం సీక్వెల్ 2 తరువాత ఇదే టైటిల్ తో 3 గా వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లు అనుష్క, శృతి హాసన్ నటించనున్నారని దర్శకుడు హరి తెలిపారు. తమ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభం కావచ్చునని, మొట్టమొదటిసారిగా అనిరుధ్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా పరిచయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ట్యూటికోరన్, గోవా లలో మొదట షూటింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత ప్యారిస్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తామని హరి చెప్పారు. సింగం మొదటి రెండు భాగాలూ బాక్సాఫీస్ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మూడవ సింగం ఏం చేస్తాడో వేచి చూద్దాం...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ