భారీ అందాలు అనే మాట అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు నమిత. ఈ కోలీవుడ్ బొద్దు సుందరి ఏ పనిచేసినా సంచలనం సృష్టిస్తుంది. కావాలనే తన ఒళ్లు తగ్గించుకోకుండా అందాలను అపరిమితంగా పెంచుకుంటున్న నమిత తంబీల ఆరాధ్యదైవంగా కుష్బూ, హన్సికల సరసన అల్రెడీ నిలిచింది. ఈ మధ్య సినిమాలు తగ్గించి సోషల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొంటున్న నమిత మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాతో ముందుకు వస్తుంది. ఆమె నటించిన 'తర్ కాప్పు' (ఆత్మరక్షణ) చిత్రం ఆడియో వేడుక మలేషియాలో జరిగింది. ఈ సందర్భంగా నమిత కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది
మహిళలు తమని తాము కాపాడుకోవడానికి రెండు వస్తువులు తప్పకుండా వుండాలని అంటోంది. తన బ్యాగులో ఎప్పుడూ పిన్నీసులు, పెప్పర్ స్ప్రేలు రెడీగా ఉంటాయంటోంది బొద్దుగుమ్మ. దీని గురించి చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి కూడా వెళ్లింది.
"నేను చదువుకునే రోజుల్లో బస్సులో వెళుతుంటే కొంతమంది అబ్బాయిలు నన్ను తాకడానికి ట్రై చేసేవారు. దాంతో, ఓ రోజు బాగా ఆలోచించి, ఆ మర్నాడు బ్యాగులో పిన్నీసులు పెట్టుకుని వెళ్లాను. బస్సులో నన్ను తాకాలని చూసిన వాడిని ఆ పిన్నీసుతో గుచ్చాను. ఆ దెబ్బకు గిలగిలలాడి చచ్చాడు. మళ్లీ నా జోలికి రాలేదు. అలాగే, అప్పట్లోనే నేను పెప్పర్ స్ప్రే వుంచుకునేదానిని. ఇప్పటికీ ఈ రెండూ నా దగ్గర వుంటాయి. మహిళలు తమని తాము కాపాడుకోవాలంటే ఈ రెండూ వుండాలి" అంటూ చెప్పుకొచ్చిందీ భారీ అందాల సుందరి.