భలే భలే మగాడివోయ్ ఇచ్చిన బూస్ట్ తో అదే ఊపును కంటిన్యూ చేయడానికి నాని తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఒక సినిమాను అంగీకరించాడు. జెమిని కిరణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను, ఉయ్యాలా జంపాలా దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే ఉద్దేశంతో వున్నారు.
హీరోగా నాని దర్శకుడిగా విరించి వర్మ హిట్ కొట్టిన తరువాత చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఎక్కువగా వుంటాయి. యూత్ లో ఈ సినిమాపై ఆసక్తిపెరిగే అవకాశం వుంది. ప్రస్తుతం నాని నటిస్తోన్న 'జై బాలయ్య' సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణతో ఆయన చేస్తోన్న సినిమా, షూటింగ్ దశలో వుంది. వీటి తరువాతనే ఆయన తాజా చిత్రం పట్టాలెక్కనుంది. మరి ఇన్ని ప్రాజెక్టులతో నాని కెరీర్ కన్ఫ్యూజన్ లో పడిపోదు కదా.