అదేం షూటింగ్... అవేం పాట్లు

December 09, 2014 | 01:32 PM | 78 Views
ప్రింట్ కామెంట్

చిత్ర కథకు తగినట్టు ఒక్కోసారి ఎక్కడెక్కడో షూటింగ్ లు చేస్తుంటారు. మరి ఈ కథ ఏమిటో అంత దూరం వెళ్లాల్సిన అవసరమేమిటో సస్పెన్సే. కానీ అంత దూరం వెళ్ళలేకపోయినా సినిమాలో చూసి తరిద్దామనుకుంటారు జనాలు. అసలే శీతాకాలం ఇక ఇప్పడు మరింత శీతల ప్రదేశాల్లో షూటింగ్ చేయడమంటే ఎంత సాహసం. అది ఎవరెస్ట్ శిఖర ప్రదేశంలో ఎత్తయిన కొండలు, మంచుపడితే జర్రున జారిపడిపోతుంటాం. అలాంటి ప్రదేశంలో నాని ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ కోసం వెళ్లి తన అనుభవాలు చెప్పుకొచ్చాడు. అలాంటి పరిస్థితిని అనుభవించాలే గానీ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 5,300 అడుగుల ఎత్తులో ఉందట. అక్కడ ఆక్సిజన్ కూడా కరువేనంటున్నాడు. చుట్టూ కొండలు, గుట్టలు, జడల బర్రెలు, అడవి దున్నలూ వాటితో సహవాసం చేస్తూ షూటింగ్... భయమంటే ఏమిటో తెలిసొచ్చిందట నానీకి. సముద్ర తీరానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న మరో ప్రదేశం లుక్లా లో ట్రెక్కింగ్ చేశారట. తినడానికి బేస్ క్యాంప్ నుంచి కొన్ని పదార్థాలు తీసుకుని వెళ్లారట. ఈ షూటింగ్ దాదాపు 20 రోజులు జరిగిందనీ, ఈ సమయంలో ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్లు కూడా లేవని చెప్పాడు. యూనిట్ వాళ్లు కొందరు సిక్ అయిపోతే ఖాట్మండ్ కు తరలించారట. మొత్తానికి ఈ షూటింగ్ మరిచిపోలేని ఓ అనుభ వాన్ని మిగిల్చిందని చెప్పాడు నాని. సినిమా సంగతి ఏమో గానీ, ఇలాంటి విషయాలు విన్న వారంతా ఆ సినిమాను గుర్తు పెట్టుకొని ఆ సీన్ చూడ్డం కోసం సినిమాకు వెళ్లడం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ