ఈ మధ్య సినిమాలు రిలీజ్ చేయాలంటే ఎంతో ఆలోచించాల్సి వస్తుంది. ఈ చిత్రానికి ముందూ వెనక రిలీజయ్యే సినిమాలు, పిల్లలకు పరీక్షల సమయాలు ఇవన్నీ చూసుకుని ముహూర్తం నిర్ణయించుకుంటున్నారు. ఇక చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పోటీ పడడం అంటే చాలా సాహసమే మరి. వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమా కోసం ఇటు ఇండస్ట్రీకి, అటు అభిమానులకు చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఇక దీనికి ముందు అంటే ఎన్టీఆర్ టెంపర్ విడుదలవుతుంది. ఐ సినిమా కూడా అదే సమయంలో రిలీజవుతున్నట్టు సమాచారం. మరి ఇంత పెద్ద స్టార్ల సినిమాలు విడుదలవుతున్న సమయంలోనే శర్వానంద్, నిత్యామీనన్ల సినిమా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు విడుదల చేయడం ఎంత పెద్ద సాహసం. అయినా ఇది కూడా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఏమో చెప్పలేం. చిన్న సినిమాలే ఒక్కోసారి పెద్ద హిట్లు అవ్వచ్చు కదా. ఈ సినిమా యూనిట్ అంతా అదే ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. శర్వానంద్ ఇందులో స్పోర్ట్స్ మన్ గా నటిస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ జనాలని తప్పకుంటా ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా చెపుతున్నారు. శర్వానంద్ కు రన్ రాజా రన్ తరువాతి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రం విజయం దిశలో పయనించాలననీ, వీరి సాహసం ఫలించాలని కోరుకుందాం.