నాని, అమలాపాల్, రాగిణి ద్వివేది నటించిన జండాపై కపిరాజు తెలుగు, తమిళంలో తెరకెక్కింది. కానీ తమిళంలో పెద్ద ప్లాప్ గా రిజిస్టర్ అయింది. తెలుగులో ఈ ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ద్విపాత్రాభినయం చేశానని, చాలా కష్టపడి చేసిన సినిమా ఇది అని నాని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా తనకు పెద్ద హిట్ అవుతుందనీ అన్నారు. ఈ సినిమాను మల్టీడైమన్షన్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి, ఎస్. శ్రీనివాసన్ నిర్మించారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమా యావరేజ్ అని టాక్ వచ్చినా నానికి ఉగాది బావున్నట్టే. లేకుంటే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా గుర్తులతో ఉగాదిని జరుపుకోవాల్సి ఉంటుందేమో