నానికి 2015కి బాగానే కలిసొస్తున్నట్టుంది. గతంలో ఎన్టీఆర్, కృష్ణ, బాలకృష్ణ సినిమాలు మాత్రమే ఒకేరోజు రెండు విడుదలయ్యాయని అనువజ్ఞల మాట. ఈ తరం కథానాయకుల్లో ఎవరివీ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాలేదు. కానీ ఈ నెల 21న నాని నటించిన స్ట్రెయిట్ సినిమా ఎవడే సుబ్రమణ్యం, అనువాద సినిమా జండాపై కపిరాజు విడుదల కానున్నాయి. అంటే నానితో నాని పోటీపడుతున్నట్టు లెక్క. వీటిలో ఒక సినిమాను మరో వారం రోజులు వాయిదా వేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాకపోతే ఏ సినిమా వెనక్కి వెళ్తుందన్నది మిస్టరీ. అది ఓ వైపుంటే నాని ప్రస్తుతం హైవే మీద నిలుచున్నాడు. కారు పంచరయ్యో, లిఫ్ట్ కోసమో కాదు. తాను నటిస్తున్న భలే భలే మొగాడివోయ్ సినిమా కోసం. ఈ సినిమాను మారుతి దర్శకత్వం చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలో కొన్ని హైవే సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ను గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ కలిసి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి నాయిక.