ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో చంద్రబోస్ రాసిన ఓ పాట ఉంటుంది. వాళ్లు నిన్ను విసిరేశామని అనుకోని వాళ్లకు తెలీదు నువ్వోక బంతివని, వాళ్లు నిన్ను పాతేశామని అనుకోని వాళ్లకు తెలీదు నువ్వోక విత్తనమని అని ఓ లైన్ ఉంటుంది. విసిరేసింది ఎవరో... పాతేసింది ఎవరో ఎన్టీఆర్ అభిమానులకు విడమరిచి చెప్పనక్కర్లేదు. ఓ వర్గం ఈ సినిమా బయటికి రాకుండా బాగా ట్రై చేసిందని, బెదిరింపులకు కూడా పాల్పడిందని ఓ ప్రముఖ పత్రిక కూడా కథనం ప్రచురించింది.
ఆఖరికి ఓ బడా హీరో సైతం సినిమా నిర్మాతను ఇబ్బంది పెట్టేందుకు విడుదల ముందు రోజు కూడా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయినా వారు అంతటితో ఆగలేదు. సినిమా విడుదలైంది. బుడ్డోడి ఏడాది కష్టంతో తెరకెక్కిన చిత్రం డివైడ్ టాక్ వ్యాపించేలా ఆ వర్గం ప్రయత్నించింది. క్లాస్, మాస్ వర్గాలంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఏం చేయలేకపోయారు.
బరిలో బాబాయ్ డిక్టేటర్, బాబాయ్ గా పిలిచే నాగార్జున, శర్వా ఎక్స్ ప్రెజ్ చిత్రాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నాన్నకు ప్రేమతోనే టాప్. 13 న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటిదాకా దాదాపు 40 కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో 55 కోట్ల బిజినెస్ మార్క్ అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.
ఈ చిత్రం కోసం తనకున్న మాస్ ఇమేజ్ ను పక్కకు పెట్టి మరీ ఈ సైకలాజికల్ మైండ్ గేమ్ సబ్జెక్ట్ కోసం స్టైలిష్ లుక్ కి మారిపోయాడు. నాలుగు భారీ పంచ్ డైలాగులు, ఓ మూడు ఫైట్లు ఉండే చిత్రాన్ని ఎంచుకోకుండా వైవిధ్యభరితమైన సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో తొలినాలుగు రోజుల్లోనే టాప్ 4 ప్లేస్ లో నిలిచిందంటే జూనియర్ ఏ రేంజ్ లో దూసుకెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులు ఎన్టీఆర్ కష్టాన్ని గుర్తించటంతోపాటు, ఒక సినిమాను తొక్కేయడానికి ఇన్ని ప్రయత్నాలా? అన్న సానుభూతి పవనాలు కూడా వీయటంతో ఫ్యాన్స్ కానీ వారు కూడా ఈ చిత్రాన్ని ఆదిరిస్తు వస్తున్నారు. ప్రస్తుతం కలెక్షన్లలో జూనియర్ సినిమానే టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది.