‘అసుర’ పాటల వేడుక

May 15, 2015 | 11:03 AM | 59 Views
ప్రింట్ కామెంట్
asura_movie_audio_released_niharonline.jpg

నారారోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్స్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘అసుర’. నారారోహిత్, ప్రియాబెనర్జి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క హయత్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, టి.డి.పి. మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్.ఎస్.ఆర్.కె.ప్రసాద్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి శేషాద్రినాయుడు,  పరుశురాం, వంశీకృష్ణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను కామినేని శ్రీనివాస్ విడుదల చేయగా, బిగ్ సీడీ, ఆడియో సీడీలను పత్తిపాటి పుల్లారావు విడుదల చేయగా తొలి సీడీని నారా రోహిత్ అందుకున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ