ధనుష్ కోలీవుడ్ లో సూపర్ స్టార్. తలైవా రజనీకాంత్ అల్లుడిగా కంటే తనకంటూ ఓ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇదయదళపతి విజయ్ మాదిరిగానే ధనుష్ కి తెలుగులో క్రేజ్ తక్కువే. కానీ రఘువరన్ బీటెక్ తో తనకంటూ ఓ సొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. అది ఇక్కడ సూపర్ హిట్ కావటంతో ధనుష్ కి క్రేజ్ కూడా పెరిగింది. కానీ తర్వాత వచ్చిన అతని రెండు చిత్రాలు అనేకుడు, మరియన్ ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తనకు అచ్చోచ్చిన సినిమా సీక్వెల్ ను నమ్ముకున్నాడు. తనకు తమిళ్ తోపాటు తెలుగులోనూ హిట్ ఇచ్చిన చిత్ర దర్శకుడితోనే తంగమన్ (వీఐపీ-2) ను తెలుగులో నవమన్మథుడు గా రావాలనుకున్నాడు. ఈ చిత్రం ఈరోజు అటు తమిళ్ లోనూ, ఇటు తెలుగులోనూ విడుదల కావాలి. కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఈ చిత్రం తెలుగు వర్షన్ ఇంకా థియేటర్లకు చేరుకోలేకపోయింది. ఈ చిత్ర తెలుగు హక్కులను బృందావన్ పిక్చర్స్ కొనుకుంది.
తంగమగన్ నిర్మాతలు బృందావన్ పిక్చర్ అధినేత కుమార్ బాబుకి మధ్య ఏవో ఫైనాన్స్ పరమైన ఇబ్బందులు తలెత్తాయట. అందుకే నవమన్మథుడు ఇంకా థియేటర్స్ లోకి రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్ చేసిన అన్ని షోలు క్యాన్సిల్ అయినట్లు సమాచారం. అక్కడ బేరం తెగ్గొడితే గానీ.. ఇక్కడ ధనుష్ బొమ్మ థియేటర్స్ లో పడదు. మొత్తానికి ధనుష్ పరువును హోల్ సేల్ గా తీసేస్తున్నారు మన తెలుగు నిర్మాతలు.