విజయ్ తో వద్దని చెప్పిన నయన్

January 24, 2015 | 12:34 PM | 33 Views
ప్రింట్ కామెంట్

నయన తార ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ లో ఉంది. అందుకే ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆఫర్ చేసిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయింది. ఇంత పెద్ద హీరోలు ఆఫర్ చేస్తే ఇతర డేట్స్ అయినా ఆపి కాల్షీట్లు ఇస్తారు హీరోయిన్ లు కానీ నయన తార సింపుల్ గా సారీ చెప్పేసిందట. విజయ్ నటించే 59వ సినిమాకు అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికను మొదట్లో నయనతారను అనుకున్నారు. ఆమె కూడా ఒకే చెప్పింది. అయితే, తీరా ఆ డైరెక్టర్ చెప్పిన డేట్స్ కు నయన్ వద్ద ఖాళీలు లేవట. ఇప్పటికే ఆమె మరో మూడు సినిమాలకు ఒప్పుకుంది. వాళ్ళకు ఇప్పటికే డేట్స్ అన్నీ ఇవ్వడంతో నయనతార నో అనక తప్పింది కాదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ