ఒక వ్యక్తి జీవితంలోని సంఘటనలు జ్ఞాపకాలుగా మారి అతనితో పాటు ఎలా ప్రయాణం చేస్తాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ రాజా ప్రయోగాత్మకంగా చేసిన ఈ చిత్రం కాసులు రాల్చకపోయినప్పటికీ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టింది. మళయాళంలో ఈ మధ్య ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ప్రేమమ్, మన తెలుగులో హ్యాపీ డేస్ లాంటి చిత్రాలకు ఒకరకంగా ఇదే ఇన్సిపిరేషన్. అంతేకాదు ఆటోగ్రాఫ్ కన్నడ బాషలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయి సుదీప్ కి మంచి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకి మూల రచయిత, నటుడు చేరన్ మరో ప్రయోగానికి సిద్ధమౌతున్నాడు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలనే ఉద్దేశంతో చేరన్ కథ రెడీ చేసుకున్నాడట. మొదటిభాగంలో స్నేహ .. గోపిక ప్రధాన పాత్రలను పోషించగా, రెండవభాగం కోసం ఆయన నయనతారను సంప్రదించాడట. మొదటిభాగం ప్రేక్షకుల ఆదరణ పొందడం వలన .. రెండవభాగం కథ నచ్చడం వలన నయనతార వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ నెలలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చేరన్ సన్నాహాలు చేస్తున్నాడని చెబుతున్నారు.