మూడు పదుల్లోకి అడుగు పెట్టిన నయనతార జీవిత భాగస్వామి ఎంపికలో తను ఫెయిల్ అవడంతో ఇక ఆ నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేసిందట. ఈ మధ్య తన మాజీ ప్రియుడు శింబుతో ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తిరిగి తనకు దగ్గర కావాలని చూస్తోందనే కామెంట్లు వచ్చాయి. ఆ హీరో బర్త్ డే కోసం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇంకే ముంది మాజీ జంట ఒక్కటే పోతోందని, త్వరలో పెళ్ళి పీటలమీదకు ఎక్కుతారనీ రూమర్లు బాగా వచ్చేశాయి. అయితే నయనతార పెళ్ళిని పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ విషయం గురించి ఆమె ఇంట్లో చర్చించారట. సినిమా ఇండస్ర్టీతో సంబంధంలేని వ్యక్తిని చూడమని పేరెంట్స్ కు విన్నవించుకుందని కోలీవుడ్ టాక్. సినిమావాళ్ళతో విసుగుచెంది నయనతార ఈ నిర్ణయానికి వచ్చినట్టుంది. ఆ ఫీల్డులో లేని వారిని పెళ్ళి చేసుకుని ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో మరి.