నయన్ గాసిప్స్ ను ఎంజాయ్ చేస్తోందా?

June 16, 2015 | 04:17 PM | 0 Views
ప్రింట్ కామెంట్
nayanatara_director_vignesh_niharonline

నటులపై గాసిప్స్ రావడం వాటిని తేలిగ్గా తీసుకునే వారు కొందరయితే మరికొందరు ఫైర్ అయిపోతుంటారు. ముంబై లాంటి ప్రదేశాల్లో అయితే వీటిని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కావాలని రూమర్స్ పుట్టించుకుంటారట కూడా. అయితే ఇటీవల కాలంలో ఇలాంటివాటిని మన సౌత్ హీరోయిన్లు కూడా లైట్ తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. వీటిని ప్రచారం కింద వాడుకుంటున్నారు. ప్రచారం కోసం కొందరు ధనాన్ని వెచ్చిస్తే, మరి కొందరు సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇంకొందరు యుక్తిని ఉపయోగిస్తుంటారు. నటి నయనతార ఈ మూడో కోవకి చెందినట్టుగా అనిపిస్తోంది. దక్షిణాదిలో ఏ నటి ఎదుర్కోని సమస్యలు నయన్ ఎదుర్కొంది. ప్రేమలో రెండుసార్లు ఓడిపోయారు. ఇక మూడోసారి ప్రేమలోకి దిగిందని ప్రచారం జోరుగా సాగుతోంది. యువ దర్శకుడు విఘ్నేశ్ శివతో నయనతార ప్రేమాయణం సాగిస్తున్నారన్నది కోలీవుడ్ టక్. ఇలాంటి వదంతులు హోరెత్తుతున్నా ఏమాత్రం చలించని నయనతార దర్శకుడు విఘ్నేశ్‌శివతో సన్నిహితంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్‌చల్ చేస్తోంది. అయినా సరే నయనతార స్పందించక పోవడం చూస్తుంటే ఇలాంటి వదంతులను ఆమే ప్రచారం చేసుకుంటున్నారనిపిస్తోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఈ చిత్రం ఏ షూటింగ్ కోసమూ తీసింది కాదు... అచ్చంగా లవర్స్ లాగా దిగారు. ఇద్దరి మధ్య ఏ సాన్నిహిత్యం లేనప్పుడు ఫొటో ఎందుకు దిగాలి. అది సోషల్ నెట్ వర్క్ దాకా ఎందుకు తీసుకురావాలి? ఉచిత పబ్లిసిటీకి కాకపోతే...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ