పోలీసు రక్షణలో శోభన్ బాబు విగ్రహం

June 16, 2015 | 04:08 PM | 0 Views
ప్రింట్ కామెంట్
shobhanbabu_statue_in_police_pahara_niharonline

తెలుగు సినీ  నటుడు, దివంగత శోభన్‌బాబు విగ్రహం తొలగించాలని చెన్నైలోని తమిళగ  మున్నేట్ర దళం(టీఎండీ) ఆందోళనకు పిలుపు నివ్వడంతో సోమవారం ఆ విగ్రహానికి పోలీసులు రక్షణ కల్పించారు. ముందు జాగ్రత్తగా టీఎండీ కార్యదర్శి కె.వీరలక్ష్మి ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శోభన్‌బాబు మరణించిన తరువాత చెన్నై మెహతానగర్ నెల్సన్ మాణిక్యం రోడ్డు మలుపులో ఆయన విగ్రహం నెలకొల్పారు. ఆయన ఇంటికి ఎదురుగా వారి సొంత స్థలంలో కుటుంబ సభ్యులే 2008లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ పీఠాన్ని పుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని 2012లో కొంత వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శోభన్‌బాబు విగ్రహాన్ని తొలగించాలనే డిమాండ్‌పై ఆందోళన చేయనున్నట్లు టీఎండీ ప్రకటించింది.  శోభన్ బాబు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన చేయబోతున్నట్లు తమిళ మున్నేట్ర దళం కార్యదర్శి వీరలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు నిన్న స్థానికులు విగ్రహం వద్ద గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు శోభన్ బాబు విగ్రహానికి రక్షణగా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వీరలక్ష్మిని, తోటి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా  ఈ విషయంలో శోభన్‌బాబు కుమారుడు కరుణశేషుకు తెలుగు సంఘాలు అండగా నిలిచాయి. తెలుగు ప్రముఖులు రంగనాయకులు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సూర్యప్రకాశరావు, తంగుటూరి రామకృష్ణ శోభన్ కుమారుణ్ని కలసి సంఘీభావం తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ